FIND MY PHONE (The new features of the Google)

If your phone is lost ... Google vetikipedutundi:-

మీ ఫోన్ పోయిందా... గూగుల్‌కు చెబితే వెతికిపెడుతుంది

  • The new features of the new Google Now to get closer to the customers to come to the front with a new feature. Cuki that your lost phone through which you will be able to telusukunenduka. If you lost your phone to discover it for themselves, says Google places tiragakunga. Let adelago


దొంగిలించినా అలాగే అది మిస్సయినా
పోయిన మీ ఫోన్ ఆచూకీ తెలుసుకోవడానికి ఇక కష్టపడాల్సిన పని లేదంటోంది ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్. దొంగిలించినా అలాగే అది మిస్సయినా గూగుల్ లో వెతకమని చెప్తోంది.

ఫైండ్ యువర్ ఫోన్
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ వినియోగదారులకోసం 'ఫైండ్ యువర్ ఫోన్' పేరున కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. ఈ సదుపాయంతో వినియోగదారులు కేవలం గూగుల్ సెర్స్ లో 'ఐ లాస్ట్ మై ఫోన్' అని టైప్ చేసి ప్రత్యేక సర్వీసును పొందొచ్చని సంస్థ వెల్లడించింది.

గూగుల్ మై అకౌంట్ లో
గూగుల్ మై అకౌంట్ లో ఉండే ఫైండ్ యువర్ ఫోన్ ఫీచర్... ఐఫోన్ పోగొట్టుకున్నవారికి సహాయపడుతుందని, అయితే ఇంతకు ముందే 'యాపిల్ ఐ క్లౌడ్' లో ఉన్న 'ఫైండ్ మై ఐ ఫోన్' కు ఉన్న సామర్థ్యం ఈ 'ఫైండ్ యువర్ ఫోన్' లో లేదని గూగుల్ చెప్తోంది.

గూగుల్ ఖాతాలో సైన్ ఇన్
తాము కొత్తగా ప్రవేశ పెట్టే ఫైండ్ యువర్ ఫోన్ వినియోగించుకోవాలనుకున్నవారు గూగుల్ ఖాతాలో సైన్ ఇన్ అయిన తర్వాత అక్కడ యాండ్రాయిడ్, ఐ ఫోన్, టాబ్లెట్ల జాబితా తో పాటు.. పోయిన ఫోన్ మీ సొంతం అయితే 'ఫైండ్ అండ్ లాక్' ఆప్షన్ చూపిస్తుందని దాంతో మీ ఫోన్ లాక్ చేసి అనంతరం వెతికేందుకు స్థానిక పోలీసుల సహాయం తీసుకోవాల్సి ఉంటుందని గూగుల్ చెప్తోంది.

ఈ ఫీచర్ జీ మెయిల్, గూగుల్ ఫోటో వినియోగదారులకు కాగా
ఈ ఫీచర్ జీ మెయిల్, గూగుల్ ఫోటో వినియోగదారులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది.

లాక్ స్క్రీన్ పాస్ వర్డ్ సెట్ చేసుకున్నట్లే
అలాగే ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడ అవే ఐదు ఆప్షన్లు కనిపిస్తాయని, వారు మాత్రం లాక్ స్క్రీన్ పాస్ వర్డ్ సెట్ చేసుకున్నట్లే ముందుగానే ఫోన్లో పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చని, అలా కాని పద్ధతిలో ఫోన్ పోయిన తర్వాత కూడ ఫోన్ కు నోట్ పంపే అవకాశం ఉందని చెప్తోంది.

లేటెస్ట్ వర్షన్స్ లో వాయిస్ ఆప్షన్ 
ఫోన్ కు పేజ్ నుంచి కాల్ చేయడం వల్ల కూడ ఆండ్రాయిడ్ ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉందంటోంది. దీంతోపాటు గూగుల్ మై అకౌంట్ లోకి వెళ్ళేందుకు లేటెస్ట్ వర్షన్స్ లో వాయిస్ ఆప్షన్ ను కూడ చేర్చింది. దీంతో మీకు కావలసిన ఆప్షన్ ను మాటలతోనే ఎంచుకునే అవకాశం ఉంది.

తమ పేరును చెప్పి షార్ట్ కట్ ద్వారా అకౌంట్ లోకి 
దీంతోపాటు గూగుల్ వినియోగదారులు త్వరలో తమ పేరును చెప్పి షార్ట్ కట్ ద్వారా అకౌంట్ లోకి ప్రవేశించే సౌకర్యాన్ని కూడ అందుబాటులోకి తేనుంది.
Previous
Next Post »