WhatsApp use without internet:-
వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్ ఉంటే చాలు.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కొన్న ప్రతి ఒక్కరూ వాట్సప్ వాట్సప్ అంటూ పరుగులు పెడుతున్నారు.. అదే సమయంలో ఇంటర్నెట్ బిల్లులు తడిసి మోపెడవుతుండటంతో దాన్ని ఎలా తగ్గించుకోవాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారిక కోసం ఓ కొత్త సిమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ సిమ్‌తో మీరు ఇంటర్నెట్ లేకుండానే ఏం చక్కా మెసేజ్ లు పంపించుకోవచ్చు. అయితే మీరు మెసేజ్ పంపించాలని కోరుకొనేవారు ఈ సిమ్‌తో కనెక్ట్ అయి ఉండాలి. ఆ అవకాశాన్ని చాట్ సిమ్ కల్పిస్తుంది. మరి దీనిని ఎలా కొనాలంటే మీరు E వెబ్‌సైట్‌కి లాగిన్ అయి ఆర్డర్ ప్లేస్ చేసి చాట్ సిమ్‌ను కొనుక్కోవచ్చు. చాట్ సిమ్ ఖరీదు రూ.745. ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది. అయితే ఇమేజెస్, వీడియోలు షేర్ చేసుకోవడానికి అదనంగా చెల్లించాలి. చాట్ సిమ్‌ను ఇండియాకు తెప్పించుకోవాలంటే మీరు షిప్పింగ్ ఛార్జీలు కూడా భరించాల్సి ఉంటుంది మరి.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon