రూ.9 లక్షలకు పైగా mobile phone:-
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన అంకుర సంస్థ సిరిన్ ల్యాబ్స్ ఆవిష్కరించింది. హైఎండ్ మోడల్ ధర 14,000 డాలర్లు (రూ.9 లక్షలకు పైగా). స్మార్ట్‌ఫోన్లలో రోల్స్‌రాయిస్‌గా పిలుచుకునే దీని పేరు ‘సొలారిన్’. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, అత్యధిక వేగంతో వైఫై అనుసంధానత, 23.8 మెగాపిక్సెల్ వెనుక కెమేరా, 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌ఈడీ 2కే రెజొల్యూషన్ తెర దీని ప్రత్యేకతలు. బయట లభించని భద్రతా వ్యవస్థతో దీన్ని రూపొందించారు. ధనికులు, ప్రముఖుల కోసం తయారు చేసిన సొలారిన్ స్మార్ట్‌ఫోన్, ప్రస్తుతం సిరిన్ ల్యాబ్స్ లండన్ విక్రయశాలలో లభిస్తుంది. 2006లో నోకియా 3,10,000 డాలర్ల విలువైన ‘సిగ్నేచర్ కోబ్రా’ మొబైల్‌ను, 2011లో 5000 డాలర్ల విలువైన కాన్‌స్టెల్లేషన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon