చాలా బడ్జెట్ ఫోన్లలో అంతర్గత (ఇంటర్నల్) మెమరీ తక్కువగా ఉంటుంది. మరికొన్నిటిలో ఎక్కువగా ఉన్నా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునే మెమరీ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ సమస్యని ఎలా అధిగమించాలో చూద్దాం...
మొదట మీ అంతర్గత మెమరీ ఎంతుందో పరిశీలించుకోవాలి.. ఈ సమస్య ఎక్కువగా వచ్చే మొబైళ్లను పరిశీలిస్తే అది 1 జీబీ నుంచి 4 జీబీ మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ మెమరీ ఎక్కువ ఉన్నా ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం మాత్రం 1జీబీకి ఇచ్చే మొబైళ్లు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. సెట్టింగ్స్‌లో యాప్ మేనేజర్ ఓపెన్ చేసుకుని ఆల్ యాప్స్ టాబ్ ఓపెన్ చేసుకోవాలి.. తరవాత షార్ట్‌బై సైజ్ అని ఇస్తే ఏ యాప్ ఎంత మెమరీ తీసుకుంటుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అదీ ఎక్కువ స్పేస్ వాడేవి మొదట వస్తాయి.. వాటిలో మనకు అవసరమైన యాప్స్ ఏంటనేవి చూసుకోవాలి.. స్థలం ఎక్కువ ఆక్రమించేవాటిని మెమరీ కార్డులోకి తరలించే అవకాశం ఉందో లేదో చూసుకోవాలి. ఒక వేళ ఉంటే దాని వల్ల దాదాపు 60 శాతం మెమరీ మిగులుతుంది.
ఇన్‌బుల్ట్ యాప్స్‌ని డిసేబుల్ చేసుకోవాలి.
మనం ఫోను కొన్నప్పుడు కొన్ని యాప్స్ మనకు అవసరం లేనివి కూడా దాంట్లో కలిపి వచ్చేస్తాయి. వాటిని గుర్తించి అనిన్‌స్టాల్ చేయాలి. సాధారణంగా గూగుల్ అందించే చాలా సర్వీసులు మనం వాడం.ఆ కోవలోనే గూగుల్+ అనే యాప్ చాలా వరకు వాడరు. అటువంటి యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దాంతో అంతర్గత మెమరీ చాలా వరకు స్పేస్ వస్తుంది.
లైట్ వర్షన్లను వెతకాలి.
ప్రస్తుతం ఉన్న యాప్‌లలో ఫేస్‌బుక్ వంటివి భారీగా అంతర్గత మెమరీని తియనేయడంతోపాటు ఎస్‌డీ కార్డులోకి కూడా మూవ్ కావు. వాటిని అనిన్‌స్టాల్ చేసుకుని ఫేస్‌బుక్ సంస్థ అందించే లైట్ వర్షన్ వేసుకోవాలి. అది కేవలం 5 ఎంబీ లోపులోనే డాటా తీసుకుంటుంది. రెగ్యులర్ యాప్‌తో పోలిస్తే ఇది 90 శాతం స్థల ఆక్రమణ తక్కుతుంది.

Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon