వాట్సాప్ బాన్ చేయాలని సుప్రీమ్ కోర్టుకు పిటిషన్....!
వచ్చే బుధవారం సుప్రీమ్‌కోర్టులో వాట్సాప్ ని బాన్ చేయాలంటూ పిటిషన్ వేయనున్నారు. వాట్సాప్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ద్వారా టెరరిస్టుల సంప్రదింపులను అడ్డుకోవటం కష్టమని దేశ సమ్రక్షణ కోసం వాట్సాప్ ని బాన్ చేయాలంటూ హర్యానాకి చెందిన ఒక ఆర్‌టిఐ (రైట్ టూ ఇన్‌ఫర్మేషన్) కార్యకర్త 27 ఏళ్ల సుధీర్ యాదవ్ కేసు ఫైల్ చేసారు. ఈ ఏడాది ఏప్రిల్ లో వాట్సాప్ వారు అందించిన ఎండ్ టూ ఎండ్ 256 బిట్ ఎన్‌క్రిప్షన్ లో మెసెజెస్‌ని సెక్కురిటీ వారు కూడా కనిపెట్టలేనంత సెక్కూర్ గా ఉన్నందున టెర్రరిస్టులు ఏ సమస్య లేకుండా దేశానికి ఎలా హాని చేయాలో వాట్సాప్ ద్వారా చాట్ చేసుకునే వీళుందని భారత ఇంటెలిజెన్స్ వారుకూడా టాప్ చేయడానికి వేలులేకుండా ఉందని సుధీర్ యాదవ్ కేసు ఫైల్ చేసారు. ఒకవేళ వాట్సాప్ వారు మెసేజెస్‌ని డీక్రిప్ట్ చేయాలనుకున్నా వారి వద్ద డీక్రిప్ట్ చేయటానికి కావలసిన కీస్ లేవని ఆయన తెలిపారు. వాట్సాప్‌లో ఒక మెసెజ్‌ని డీక్రిప్ట్ చేయటానికి ఒకేసారి 115, 792, 089, 237, 316, 195, 423, 570, 985, 008, 687, 907, 853, 269, 984, 665, 640, 564, 039, 457, 584, 007, 913, 129, 639, 935 ఈ కీస్ అన్నిటినీ ఏకం చేయాల్సి ఉంటుందని అలా చేయటం ఒక సూపర్ కంప్యూటర్ కి కూడా సాధ్యం అయే పనికాదని ఆయన చెప్పారు. ఇది కేవలం వాట్సాప్ లోనే కాదు మరికొన్ని మెసెంజర్ అప్లికేషన్స్ వైబర్, సెక్కూర్ చాట్, హైక్ లాంటివి మరిన్ని మెసెంజర్ యాప్స్ లోనూ హై ఎన్‌క్రిప్షన్ ఫీచర్స్ ఉన్నాయని వాటి వల్ల కూడా దేశానికి ముప్పు ఉందని ఆయన వెల్లడించారు. ఇదివరకే ట్రాయ్ కి దీని సంబంధించి లెటర్ కూడా పంపినట్లు కాని వారి నుండి ఎటువంటి స్పందనా రాలేదని అందుకే సుప్రీమ్ కోర్టులో పిటిష్ వేయనున్నట్లు తెలిపారు. సుప్రీం కోరు సుధీర్ యాదవ్ కు జూన్ 29 న కోర్టులో తన పిటిషన్ గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చింది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon