
ఫోన్ లేదా ట్యాబ్‌లెట్‌కి చార్జింగ్ పెట్టి ఫోన్ స్పందిస్తుందో లేదో గమనించాలి. తరువాత కొంత మేర చార్జింగ్ అయిన తరవాత ఆన్ చేస్తే స్టార్టప్ స్ర్కీన్ లేదా ఎర్రర్ మెసేజ్ చూపిస్తుందేమో చూడాలి. అలాంటి ఫోన్లు రిపేర్ చేయడం చాలా సులభం. రెండు మూడు క్లిక్‌లతోనే సమస్యకు పరిష్కారం ఇవ్వొచ్చు. ఆండ్రాయిడ్ బూట్‌లోడర్ ద్వారా యూజర్ డాటా అంతా తీసేసి ఫోన్ కొన్నప్పుడు ఎలాంటి కండిషన్‌లో ఉందో ఆ తరహాలో ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవచ్చు. మన డాటా అంతా రికవరీ కాక పోయినా ఫోన్ రన్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. మెమరీ కార్డులో ఉన్న డాటా పోదు కేవలం ఇంటర్నల్ మెమరీలోనివి మాత్రం తిరిగి తీసుకోలేము.
-->బూట్‌లోడర్ ద్వారా రీసెట్ చేసే విధానం...
మొదట ఫోన్లోని సిమ్, మెమరీ కార్డులు తీసేయాలి. ఆ మొబైల్‌లోని అప్ వ్యాల్యూమ్ బటన్, పవర్ బటన్ ఒకే సారి నొక్కుతూ ఆన్ అయ్యేదాక పట్టుకోవాలి. అప్పుడు ఆండ్రాయిడ్ బూట్‌లోడర్ స్ర్కీన్ వస్తుంది. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు ఇదే ఆప్షన్ ఉండదు. కొన్నిటికి వ్యాల్యూమ్ డౌన్ బటన్ + పవర్ బటన్ కలిపి నొక్కి పట్టుకోవాలి. మరికొన్ని వ్యాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్లు + పవర్ బటన్లు కలిపి నొక్కి పట్టుకోవాలి. అలాచేస్తే బూట్‌లోడర్ వస్తుంది. ఆండ్రాయిడ్ బూట్‌లోడర్‌లో చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో.. రీబూట్ సిస్టమ్ నౌ, అప్లై అప్‌డేట్ ఫ్రమ్ ఏడీబీ, ఎస్‌డీకార్డు, వైప్‌డాటా/ఫ్యాక్టరీ రీసెట్, బ్యాకప్ యూజర్ డాటా, రీ స్టోర్ యూజర్ డాటా అనే ఆప్షన్లు ఉంటాయి. (ఎక్కువ ఆండ్రాయిడ్ మొబైల్‌లో కనిపించే ఆప్షన్లు ఇస్తున్నాం. కొన్ని మొబైల్స్‌లో మార్పులు కూడా ఉంటాయి గమనించగలరు). వాటిలో వైప్ డాటా/ఫ్యాక్టరీ రీసెట్ ఆప్ష్‌న్ ఎంచుకోవాలి. వెంటనే వేరే స్ర్కీన్ వచ్చి చాలా ఆప్షన్ల మధ్య ‘డిలీట్ ఆల్ యూజర్ డాటా’ అనే ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవాలి. అంతే.. మీ డాటా అంతా డిలీట్ చేసి ఫోన్ మళ్లీ మొదలవుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు సమయం పట్టొచ్చు. అది ఆయా ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
-->>ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి...
1. వాటిలో ఫోన్ మోడల్‌కు చెంది న సంస్థ పీసీ సూట్ కంప్యూటర్‌లో వేసుకోవాలి. కానీ.. మొదట ఆ ఫోన్ సిస్టమ్‌కి కనెక్ట్ చేసినప్పుడు స్పంది స్తుందో లేదో చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం ఈ విధా నం పనిచేస్తుంది. ఆయా పీసీ సూట్ ద్వారా ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవచ్చు.
2. కొన్ని మొబైల్స్‌లో సేఫ్ మోడ్ ద్వారా సమస్యని అధిగమించొచ్చు. పవర్ బటన్ నొక్కి ఆన్ అయ్యే సమ యంలో వాల్యూమ్ అప్, డౌన్ బటన్ ఒత్తి పట్టుకుంటే ఆటోమేటిక్‌గా సేఫ్‌మోడ్‌లోకి వెళుతుంది. ఆ మోడ్‌లో ప్రారంభమైన దాంట్లో కేవలం ఆపరేటింగ్ సిస్టంతో ఇచ్చే యాప్స్ తప్పా థర్డ్‌పార్టీ యాప్‌లు పనిచేయవు. దాంతో మాల్‌వేర్‌లు బూట్‌సిస్టమ్స్‌ని ఇబ్బంది పెట్టలేవు. దాంతో సమస్య తీరుతుంది. మన డాటా కూడా సేఫ్‌గా ఉంటుంది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon